మంజుల డైరక్షన్లో సందీప్ కిషన్..!

సూపర్ స్టార్ కృష్ణ కూతురు మంజుల అసలైతే హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వాల్సింది. కాని ఫ్యాన్స్ కోరిక మేరకు ఆమెను హీరోయిన్ గా ఎంట్రీ ఇప్పించలేదు. అయితే కూతురికి ఉన్న ఇంట్రెస్ట్ ను కాదనలేక ఆమెను నిర్మాతగా ప్రమోట్ చేశాడు. షో, కావ్యాస్ డైరీ లాంటి స్పెషల్ మూవీస్ లో నటించి మెప్పించింది మంజుల. అయితే నిర్మాతగా అంత సక్సెస్ అవకపోవడంతో ఇప్పుడు దర్శకురాలిగా మరాలని ప్రయత్నాలు చేస్తుంది. 

సందీప్ కిషన్ హీరోగా మంజుల మెగా ఫోన్ పట్టుకునే ఛాన్సెస్ ఉన్నాయని తెలుస్తుంది. ఈమధ్యనే కథ చర్చలు జరిగాయట. మంజుల సినిమా అంటే మహేష్ హ్యాండ్ కచ్చితంగా ఉంటుంది అందుకే సందీప్ కిషన్ ఈ ప్రాజెక్ట్ మీద పూర్తి నమ్మకంతో ఉన్నాడట. తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా నిర్మాణ భాధ్యతలను మంజుల వేసుకున్నట్టు టాక్. మరి ఇన్నాళ్లుగా నిర్మాతగా ఉన్న మంజుల డైరక్టర్ గా చేసే ఈ మొదటి సినిమా ఎలాంటి ట్రెండ్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

అయితే ప్రత్యేకమైన అభిరుచి కలిగిన మంజుల మంచి కథతోనే మెగా ఫోన్ పడుతుంది అన్న నమ్మకంతో ఉన్నారు కృష్ణ మహేష్ ఫ్యాన్స్. సినిమా గురించిన మరిన్ని విషయాలు త్వరలో వెళ్లడవుతాయి. ప్రస్తుతం సందీప్ కిషన్ నక్షత్రం సినిమా చేస్తున్నాడు. కృష్ణవంశీ డైరక్షన్లో వస్తున్న ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు సందీప్ కిషన్.