బాలీవుడ్‌లోకి సాయి పల్లవి.. హీరో ఎవరంటే

తెలుగు ప్రేక్షకులను తన నటనతో అందచందాలతో ఫిదా చేసుకొన్న సాయి పల్లవి చాలా ఆచితూచి సినిమాలు చేస్తుంటుందనే సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆమె బాలీవుడ్‌లోకి అడుగుపెట్టబోతోంది. ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్‌తో ఆమె జత కట్టబోతోంది. ఈ సినిమాను బాలీవుడ్‌లో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించబోతోంది.

రానా, సాయి పల్లవి నటించిన విరాటపర్వం సినిమా 2022లో విడుదలైంది. ఆ తర్వాత ఇప్పటివరకు ఆమె తెలుగులో ఒక్క సినిమా కూడా చేయలేదు. ఇప్పుడు ఆమె బాలీవుడ్‌లో ప్రవేశించి హిట్ కొడితే అమీర్ ఖాన్, యశ్ రాజ్ ఫిలిమ్స్ ఆమెకు అక్కడే అనేక అవకాశాలు కల్పించడం ఖాయం. కనుక సాయి పల్లవి మళ్ళీ తెలుగులో సినిమాలు చేస్తుందో లేదో?