దేవరలో విజయ్‌ దేవరకొండ?

కొరటాల శివ దర్శకత్వంలో జూ.ఎన్టీఆర్‌, బాలీవుడ్ బ్యూటీ జాహ్నవి జంటగా చేస్తున్న దేవర సినిమా షూటింగ్‌ శరవేగంగా సాగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్‌ శివార్లలో వేసిన సెట్స్‌లో తారక్‌పై కొన్ని ముఖ్య సన్నివేశాలు ఘాట్ చేస్తున్నారు.

సాధారణంగా వీఎఫ్ఎక్స్‌ పనులు ఆలస్యం అవుతుండటం వలన సినిమాలు వాయిదా పడుతుంటాయి కనుక కొరటాల శివ ముందుగా వీఎఫ్ఎక్స్‌ అవసరమైన క్లైమాక్స్ సీన్స్ పూర్తిచేస్తునట్లు తెలుస్తోంది. 

ఇక ఈ సినిమాలో రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ కూడా ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ ఇంతవరకు అధికారికంగా ఈ విషయం ప్రకటించలేదు. 

ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీఖాన్, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, నారాయణ్, రమ్యకృష్ణ, చైత్ర రాయ్, కలైయరసన్‌, షైన్ టామ్ చాకో తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు. 

ఈ సినిమాకు కధ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కొరటాల శివ, సంగీతం: అనిరుధ్ రవిచంద్ర, కెమెరా:ఆర్‌. రత్నవేలు, ఎడిటింగ్: ఏ. శ్రీకర్ ప్రసాద్ చేస్తున్నారు.     

రూ. 300 కోట్ల భారీ బడ్జెట్‌తో యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్‌ ఆర్ట్స్ బ్యానర్లపై సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ, నందమూరి కళ్యాణ్ రామ్ కలిసి దేవర సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమావచ్చే ఏడాది ఏప్రిల్ 5 వ తేదీన విడుదల కాబోతోంది.