ప్రేమం డైరక్టర్ తో మాస్ మహరాజ్..!

దర్శకుడిగా ఓ అవకాశం వస్తే దాన్ని సరైన విధంగా వాడుకుంటే లక్కీ ఛాన్స్ దక్కించుకున్నట్టే. ఇప్పుడు అదే క్రేజ్ తో మరో లక్కీ ఛాన్స్ దక్కించుకున్నాడు ప్రేమ డైరక్టర్ చందు మొండేటి. కార్తికేయ సినిమాతో దర్శకుడిగా ప్రతిభ ఎంట్రీ ఇచ్చిన చందు ఆ తర్వాత వచ్చిన మలయాళ రీమేక్ ప్రేమంతో తన సత్తా చాటాడు. ఒక్కసారిగా పరిశ్రమ అంతా తన గురించి మాట్లాడుకునేలా చేసుకున్న చందు ఇప్పుడు రవితేజతో అవకాశాన్ని అందుకున్నాడట.

మాస్ మహరాజ్ రవితేజ కెరియర్ పరంగా కాస్త వెనుకపడ్డాడు. బెంగాల్ టైగర్ తర్వాత సంవత్సరం పాటు గ్యాప్ తీసుకున్న రవితేజ రీసెంట్ గా బాబి డైరక్షన్లో ముహుర్తం దాకా వచ్చిన సినిమా కూడా అటకెక్కింది. ఈమధ్యనే చందు రవితేజకు ఓ కథ వినిపించాడట కథ నచ్చేయడంతో చందు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తుంది. సో ఇదో విధంగా లక్కీ ఆఫర్ అనే చెప్పాలి.

మొదటి సినిమా నిఖిల్ రెండోది చైతు ఇప్పుడు రవితేజ చూస్తుంటే చందు మొండేటి స్టార్ డైరక్టర్ అయ్యేందుకు ఎంతో టైం పట్టేలా లేదు అన్న పరిస్థితులు కనబడుతున్నాయి. మరి ఈ సినిమా అయినా ఎలాంటి చిక్కు ముడులు లేకుండా పూర్తవుతుందా లేక రవితేజ బ్యాడ్ టైం తో మళ్లీ వెనక్కి వెళ్తుందా అన్నది చూడాలి. ఏది ఏమైనా రవితేజ చేసే ఈ సినిమా అటు చందుకి ఇటు రవితేజకి చాలా స్పెషల్ మూవీని అవుతుంది అని చెప్పేయొచ్చు.