సంబంధిత వార్తలు
మాచో స్టార్ గోపీచంద్ 32వ సినిమాకి నేడు హైదరాబాద్ చిత్రాలయ స్టూడియోలో పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు క్లాప్ కొట్టి లాంఛనంగా సినిమాను ప్రారంభించారు. చిత్రాలయ స్టూడియోస్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నంబర్: 1గా తెరకెక్కించబోతున్న ఈ సినిమాకు శ్రీను వైట్ల దర్శకుడు. ఆయన గోపీచంద్ కోసం మంచి మాస్ అండ్ యాక్షన్ ప్యాక్ కధని సిద్దం చేశారు. ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో వేణు దోనేపూడి నిర్మించబోతున్నారు.త్వరలోనే ఈ సినిమాకు సంబందించి పూర్తి వివరాలు తెలియజేస్తామని ఆయన చెప్పారు. మొదటి షెడ్యూల్ విదేశాలలోనే మొదలుపెట్టబోతున్నామని చెప్పారు.