రజనీకాంత్ హీరోగా 2005లో విడుదలైన చంద్రముఖి సినిమా ఎంత సూపర్ హిట్ అయ్యిందో తెలిసిందే. మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత దానికి సీక్వెల్‌గా చంద్రముఖి-2 వస్తోంది. ఆ సినిమాకు దర్శకత్వం వహించిన పి.వాసుయే దీనికీ దర్శకుడు. ప్రముఖ నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్ లారెన్స్ రాఘవ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ దీనిలో ప్రధాన పాత్రలు చేశారు. వినాయక చవితి సందర్భంగా ఈనెల 15వ తేదీన చంద్రముఖి-2ని విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. కానీ కొన్ని సాంకేతిక కారణాల వలన ఈ సినిమాను ఈ నెల 28న విడుదల చేయబోతున్నామని లైకా ప్రొడక్షన్స్ ట్వీట్ చేసింది.
ఈ సినిమాలో రాజుగారిగా రాఘవ లారెన్స్, నర్తకిగా కంగనా రనౌత్ నటించారు. చంద్రముఖి-2లో రాధికా శరత్ కుమార్, లక్ష్మీ మీనన్, వడివేలు తదితరులు ముఖ్యపాత్రలు చేశారు.
లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం హిందీ భాషల్లో చంద్రముఖి-2నిర్మించారు. ఈ సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతం అందించారు.