అల్లు అర్జున్, రష్మిక మందన జంటగా చేస్తున్న పుష్ప-2 సినిమా షూటింగ్ హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో జోరుగా సాగుతోంది. అల్లు అర్జున్ ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రామోజీ సిటీలో పుష్ప-2 షూటింగ్‌లో పాల్గొని సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేవరకు దినసరి చర్య ఏవిదంగా ఉంటుందో తెలియజేస్తూ ‘డే విత్ అల్లు అర్జున్’ అనే పేరుతో చిన్న వీడియో క్లిప్పింగ్ విడుదల చేశారు.
ఇప్పుడు రష్మిక మందన, ఈ సినిమాలో పుష్ప కోసం రామోజీ సిటీలో వేసిన ఇంటి సెట్ చూసి మురిసిపోయి, ఆ ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో షేర్ చేసింది. విలాసవంతమైన ఆ ఇంటిని చూసి చాలా థ్రిల్ ఫీలైన రష్మిక మందన దానిని అభిమానులతో షేర్ చేసుకొందని తెలియజేస్తూ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ కూడా ట్విట్టర్‌లో ఆ ఫోటోని పెట్టింది. కొన్ని దశాబ్ధాల క్రితం జరిగిన కధగా ఈ సినిమాను తీస్తున్నందున ఇంటి సెట్ ఆనాటి వైభవానికి అద్దం పడుతున్నట్లు నిర్మించారు.
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక మందన జంటగా వచ్చిన పుష్ప సినిమాకి సీక్వెల్‌గా ‘పుష్ప2: ది రూలింగ్’ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. పుష్ప-1లో నటించిన ఫహాద్ ఫాసిల్, ధనుంజయ్, సునీల్, రావు రమేష్, అనసూయ, అజయ్, శ్రీతేజ్, మీమ్ గోపిలతో పాటు ఈ సినిమాలో జగపతి బాబు కూడా కీలకపాత్ర చేస్తున్నారు.
తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న పుష్పా-2 సినిమాని మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా కలిసి నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకి ఫోటోగ్రఫీ: మీరొస్లా కుబా బ్రోజెక్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్ అందిస్తున్నారు. పుష్ప2 ఈ ఏడాది డిసెంబర్‌లో లేదా 2024 సంక్రాంతి పండుగకి విడుదలయ్యే అవకాశం ఉంది.

Our #Srivalli @iamRashmika shares her excitement with a pic from the lavish sets of #Pushpa2TheRule ❤️

Icon Star @alluarjun @aryasukku @ThisIsDSP #FahadhFaasil @SukumarWritings @TSeries pic.twitter.com/D4YYN67QDj
— Mythri Movie Makers (@MythriOfficial) September 8, 2023