బేబీకి బొమ్మరిల్లు భాస్కర్ సినిమా ఛాన్స్?

బేబీ సినిమాపై ప్రశంశలు, విమర్శలు సరిసమానంగానే వచ్చిన్నప్పటికీ సినిమా సూపర్ హిట్ అయ్యింది. దానిలో హీరోయిన్‌గా నటించిన వైష్ణవి చైతన్యకు అందరి కంటే ఎక్కువ మార్కులు పడ్డాయి. అయితే అటువంటి బోల్డ్ రోల్ చేసినందుకు ఆమెకు ఇకపై అటువంటి అవకాశాలే వస్తాయని, అసలు అవకాశాలే రాకపోవచ్చుననే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఆమె ప్రముఖ దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ తన సినిమాలో హీరోయిన్‌గా ఆఫర్ ఇచ్చిన్నట్లు తెలుస్తోంది. ఆయన దర్శకత్వంలో సిద్ధూ జొన్నలగడ్డతో ఇటీవలే ఓ సినిమా ప్రారంభిచారు. దానిలోనే వైష్ణవి చైతన్యకు అవకాశం లభించిన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఆమెకు నిజంగానే ఈ సినిమాలో అవకాశం లభించి ఉంటే, ఇక ఆమె వెనుతిరిగి చూసుకోవలసిన అవసరం ఉండకపోవచ్చు. 

ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ కూడా తన తదుపరి సినిమాలో వైష్ణవి చైతన్యను హీరోయిన్‌గా తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ రెండు సినిమా అవకాశాల గురించి స్పష్టత రావచ్చు.