
తెలుగు సినీ పరిశ్రమలో దారి తప్పిన నటీనటులలో శ్రీరెడ్డి కూడా ఒకరని చెప్పక తప్పదు. ఆమె నటిగా నిలద్రొక్కుకొనే ప్రయత్నంలో కొందరు సినీ, రాజకీయ ప్రముఖులతో అక్రమ సంబంధాలు పెట్టుకొని దారి తప్పిన్నట్లు ఆమె మాటలతోనే తెలుస్తోంది. తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌తో గతంలో తనకు అక్రమ సంబంధం ఉందంటూ శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆమె ఏమందంటే, “ఉదయనిధి స్టాలిన్‌తో నాకు మూడేళ్ళుగా పరిచయం ఉంది. అతను నాకు సినిమా అవకాశాలు ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి నన్ను శారీరికంగా లొంగదీసుకొని వాడుసుకొన్నాడు తప్ప నాకు ఎటువంటి అవకాశాలు కల్పించలేదు. అతనో పచ్చి మోసగాడు,” అని శ్రీరెడ్డి ఆరోపించింది.
అయితే ఆమె గతంలో కూడా పలువురు హీరోలు, దర్శకనిర్మాతలను ఉద్దేశ్యించి ఇటువంటి ఆరోపణలే చేసి ఉన్నందున, ఎవరూ ఆమె మాటలని విశ్వసించలేని పరిస్థితి ఆమె స్వయంగా కల్పించుకొందని చెప్పక తప్పదు. పదేపదే ఇటువంటి ఆరోపణలు చేస్తుండటం వలన సమాజం దృష్టిలో మరింత చులకనవుతున్నానని గ్రహించిన్నట్లు లేదు. అదే.... ప్రముఖ పోర్న్ స్టార్ సన్నీ లియోన్ గురించి అందరికీ తెలిసి ఉన్నప్పటికీ ఆమె బాలీవుడ్లో మంచి అవకాశాలు దక్కించుకొంటుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. మరి అటువంటి గతం లేని శ్రీరెడ్డి సినీ పరిశ్రమలో ఎందుకు రాణించలేకపోతోంది?అని ఆమే ఆలోచించుకోవలసి ఉంటుంది.