రూమర్స్ కు చెక్ పెట్టేసింది..!

మలయాళ ప్రేమంతో ఎంట్రీ ఇచ్చిన సాయి పల్లవి అభినయంలో అదరగొట్టేస్తుంది. ప్రేమం హిట్ లో ముఖ్య పాత్ర పోశించిన అమ్మడి టాలెంట్ సౌత్ లో మిగతా పరిశ్రమలకు తెలిసింది. ఇక అదే జోష్ లో తెలుగులో ఫిదా సినిమాలో మెగా హీరో వరుణ్ తేజ్ సరసన నటిస్తున్న ఈ అమ్మడు తమిళంలో తనపై వస్తున్న రూమర్లకు చెక్ పెట్టేసింది. తన ఆఫర్స్ కోసం వచ్చే వారికి కండీషన్స్ పెట్టి వేధిస్తుందని.. స్కిన్ షో గట్రా చేసేందుకు వీలు లేదని.. ఇక ఇంటిమేట్ సీన్స్ ఉంటే ఆ సినిమా చేయనని ఏవేవో అన్నదని కోలీవుడ్ మీడియా హడావిడి చేసింది. 

అయితే ఈ వార్తల్లనిటికి స్పందించిన సాయి పల్లవి అసలు ఇలాంటి రూమర్స్ ఎలా వస్తాయో తెలియదు అంటుంది. తమిళంలో ఏ దర్శకుడు తనను సినిమా కోసం సంప్రదించలేదని.. మరి అలాంటప్పుడు తాను ఎలా ఇవన్ని అనగలుగుతానని ఎదురు ప్రశ్న వేస్తుంది సాయి పల్లవి. ఇప్పుడు సినిమాల్లో ఎంట్రీ ఇస్తున్న భామలు ముఖానికి ఫుల్ మేకప్ తో కనిపిస్తుంటే సాయి పల్లవి మాత్రం ఎలాంటి మేకప్ లేకుండా కనిపించాలనే ఓ కండీషన్ తో సినిమాలు చేస్తుంది. ప్రేమంలో అలా నాచురల్ గా కనిపించి అందరి మనసులను దోచేసింది. 

ఇప్పుడు అదే తరహాలో తెలుగులో శేఖర్ కమ్ముల డైరక్షన్లో వస్తున్న ఫిదా సినిమాలో కూడా నాచురల్ గానే కనిపించనుందట. సాధారణంగా శేఖర్ కమ్ముల సినిమాలన్ని అలానే ఉంటాయి. సో అమ్మడికి లక్కీగా ఈ ఆఫర్ తగిలిందన్నమాట. మరి తెలుగులో వచ్చిన మొదటి ఆఫర్ ఎలా వినియోగించుకుంటుందో ఏమో కాని అమ్మడు ఇక్కడ క్లిక్ అయితే కనుక మంచి అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉంది.