నాగార్జున హోస్ట్‌గా ‘స్టార్ మా’ ఛానల్లో మళ్ళీ బిగ్‌బాస్ షో ఆదివారం నుంచి మొదలైంది. ఏకధాటిగా మూడు నెలలపాటు సాగే ఈ బిగ్‌బాస్ షో సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతీరోజూ రాత్రి 9.30 గంటల నుంచి ఈ షో ప్రసారం అవుతుంది. శని, ఆదివారాలలో రాత్రి 9 గంటలకే ఈ షో మొదలవుతుంది. డిస్నీ హాట్ స్టార్ ఓటీటీలో 24 గంటలు స్ట్రీమింగ్ అవుతుంటుంది.
ముందుగా ఈ షోలో పాల్గొనబోయేవారు నిన్న హౌస్‌లో ప్రవేశించారు. వారిలో నటీనటులు శివాజీ, షకీలా, ప్రియాంకా జైన్, అమర్ డీప్, కిరణ్ రాథోడ్, శోభ శెట్టి, శుభశ్రీ, రాతిక, డాక్టర్ గౌతమ్, ప్రిన్స్ యవార్, కొరియోగ్రాఫర్ సందీప్, మహిళా రైతు పల్లవి ప్రశాంత్, జబర్ధస్త్ కమెడియన్ టేస్టీ తేజ ఉన్నారు.
సాధారణంగా బిగ్‌బాస్ హౌస్‌లో జరిగే పోటీలో 21 మంది పాల్గొంటుంటారు. నిన్న 7 మంది హౌస్‌లోకి ప్రవేశించారు. వచ్చే రెండు వారాలలో మిగిలిన 14 మంది కూడా ప్రవేశించనున్నారు.
నిన్న ప్రత్యేక అతిధిగా విజయ్ దేవరకొండ హౌస్‌లోకి వచ్చినప్పుడు ఖుషీ సినిమాలోని ‘ఆరాధ్యా ఆరాధ్యా..’ పాట క్లిపింగ్ వేసినప్పుడు, “విజయ్… నీ హీరోయిన్ ఎక్కడ?” అంటూ నాగార్జున ప్రశ్నించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. నాగచైతన్య, సమంతలు విడిపోయిన తర్వాత నాగార్జున ఆమె గురించి మాట్లాడిన మొదటి మాట ఇదే కావడమే ఇందుకు కారణం.
ఇక బిగ్‌బాస్ ముగింపు దశకు చేరుకొంటునప్పుడు షోలో గెలవలేమని భావించి బయటకు వెళ్లిపోవాలనుకొనే ఐదుగురు కంటెస్టెంట్స్‌కి నగదు బహుమతి తీసుకొని వెళ్ళిపోయేందుకు అవకాశం కల్పిస్తుంటారు. కానీ ఈసారి షో ప్రారంభంలోనే నాగార్జున ఓ సూట్ కేస్ తెచ్చి వారి మద్యన పెట్టి ఇప్పుడే ఎవరైనా ఇది తీసుకొని బయటకు వెళ్ళిపోవచ్చునని ఆఫర్ ఇవ్వడం మరో విశేషం.