పవన్‌ కళ్యాణ్‌ అభిమానులకు ఉస్తాద్ భగత్ సింగ్‌ కానుక

శనివారం పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్‌ పుట్టినరోజు సందర్భంగా సుజీత్ దర్శకత్వంలో నటిస్తున్న ఓజీ ఫస్ట్ గ్లింప్స్‌ అభిమానులకు కానుకగా అందించారు. అలాగే క్రిష్ దర్శకత్వంలో చేస్తున్న హరిహర వీరమల్లు నుంచి ఓ పోస్టర్‌ కానుకగా విడుదల చేశారు. దర్శకుడు హరీష్ శంకర్‌ ‘మేము కూడా ఓ గిఫ్ట్ ఇవ్వబోతున్నాము’ అంటూ ఊరించి, ఉస్తాద్ భగత్ సింగ్‌ సినిమా నుంచి ఓ అద్భుతమైన పోస్టర్‌ను శనివారం సాయంత్రం విడుదల చేశారు. 

దానిలో ఓ భవనం వద్ద అనేకమంది ముస్లిం సోదరులకు రక్షణగా నుదుట పెద్దబొట్టు పెట్టుకొని రక్తపు మరకలున్న కత్తిని పట్టుకొని పవన్‌ కళ్యాణ్‌ను కూర్చోన్నట్లు చూపారు. అంటే హిందూ ముస్లిం గొడవలు జరుగుతున్నప్పుడు హిందువైన పవన్‌ కళ్యాణ్‌ వారికి రక్షణగా నిలిచిన్నట్లు చూపారు. ‘ధర్మసంస్థాపనార్ధం సంభావామి యుగే యుగే’ అంటూ సాగే భగవథ్గీత శ్లోకాన్ని ఇదివరకు టీజర్‌లోనే చూపారు. దానికి ఇది కొనసాగింపుగా భావించవచ్చు. అంటే దర్శకుడు హరీష్ శంకర్‌ ఈ సినిమాతో మంచి సందేశమే ఇవ్వబోతున్నట్లు భావించవచ్చు.

ఈ సినిమాలో పవన్‌ కళ్యాణ్‌కు జోడీగా శ్రీలీల నటిస్తుండగా పంకజ్ త్రిపాఠి, గౌతమి, అశోతోష్ రాణా, నవాబ్ షా, అవినాష్, నాగ మహేష్, నర్రా శ్రీను, చమ్మక్ చంద్ర, కౌశిక్ మెహతా తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వైసీపీ. రవిశంకర్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.