భగవంత్ కేసరి నుంచి గణేశ్ ఏంథమ్ లిరికల్ వీడియో సాంగ్‌

నందమూరి బాలకృష్ణ, కాజల్ అగర్వాల్ జంటగా వస్తున్న భగవంత్ కేసరి సినిమా నుంచి చిచ్చా వచ్చిండు... అంటూ సాగే గణేశ్ ఏంథమ్ లిరికల్ వీడియో సాంగ్‌ విడుదలైంది. 

ఈ సినిమాలో బాలకృష్ణ కూతురుగా శ్రీలీల నటిస్తోంది. ఈ సినిమాని తండ్రీకూతుర్ల సెంటిమెంట్‌తో అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నారు. కాసర్ల శ్యామ్ వ్రాసిన ఈ పాటను తమన్ స్వరపరచగా కరీముల్లా, మనీషా పాండ్రంకి చాలా హుషారుగా పాడారు. దానికి బాలకృష్ణ, ఆయన కూతురుగా నటిస్తున్న శ్రీలీల అద్భుతంగా డ్యాన్స్ చేశారు. ఈ పాట, డ్యాన్స్ ఈ సినిమాకు హైలైట్‌గా నిలువబోతున్నాయి.   

ఈ సినిమాలో అర్జున్ రాంపాల్, ప్రియాంకా జవల్కర్ ముఖ్యపాత్రలు చేస్తున్నారు. షైన్ స్క్రీన్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 19న దసరా పండుగకి ముందు విడుదలకాబోతోంది. ఈ సినిమాకు సంగీతం: ధమన్, కెమెరా: సి.రాంప్రసాద్, స్టంట్స్: వి వెంకట్, ఎడిటింగ్: వి తమ్మిరాజు చేస్తున్నారు.