
సముద్రఖని దర్శకత్వంలో వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం బ్రో నిరాశ పరచడంతో ఇప్పుడు అందరి దృష్టి సుజీత్ కాంబినేషన్లో వస్తున్న యాక్షన్ ప్యాక్ మూవీ ‘ఓజీ’ మీదే ఉంది. ఈ సినిమాకి సంబందించి శనివారం ఉదయం 10.35గంటలు ‘హంగ్రీ చీతా’ పేరుతో ఫస్ట్ గ్లింప్స్ విడుదలకాబోతోంది.
ఈ సినిమాలో గ్యాంగ్ స్టర్‌గా నటిస్తున్న పవన్ కళ్యాణ్‌కు జోడీగా ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తున్నారు. శ్రీయారెడ్డి, ప్రకాష్ రాజ్, అర్జున్ దాస్, తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటిస్తున్నారు.
డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య చాలా బారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంగీతం: తమన్, కెమెరా: వజీద్ బేగ్ అందిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ ఏపీలోని తన రాజకీయ పర్యటనల నుంచి బ్రేక్ తీసుకొని క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు, హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలను పూర్తిచేస్తున్నారు.
సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓజీ డిసెంబర్లో విడుదలయ్యే అవకాశం ఉంది.