
కింగ్ నాగార్జున ఓంకార్ కాంబినేషన్లో ఓ సినిమా రాబోతుందని కొద్దిరోజులుగా వస్తున్న న్యూసే. అయితే ఇప్పుడు ఆ సినిమాకు సంబందించిన డీటేల్స్ బయటకు వచ్చాయి. అసలైతే ఈ కాంబినేషన్లో రాజు గారి గది-2 సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలున్నాయని తెలిసినా ఇప్పుడు వారు చేసే సినిమాపై మరో అప్డేట్ న్యూస్ వచ్చింది. నాగార్జున ఓంకార్ కాంబినేషన్లో ఓ రీమేక్ సినిమా రాబోతుంది. ఆడుపులియట్టం అనే మలయాళం రీమేక్ వీరిద్దరు సినిమా చేయబోతున్నారట.
హర్రర్ కథాంశంతో రాబోతున్న ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను కూడా అలరిస్తుందనే నమ్మకంతో ఈ సినిమా రీమేక్ చేయబోతున్నారట. వరుస విజయాలతో ఫుల్ ఫాంలో ఉన్న నాగార్జున కుర్ర హీరోలకు ఏమాత్రం తగ్గకుండా పోటీ ఇస్తున్నాడు. ఇప్పుడు ఆ ప్రయట్నంలోనే ప్రయోగాలంటూ కొత్త కొత్త సినిమాలను చేస్తున్నాడు. ఈ ఇయర్ ఇప్పటికే సోగ్గాడే చిన్ని నాయనా, ఊపిరి సినిమాలతో నటించిన నాగ్ వచ్చే ఏడాది ఓం నమో వెంకటేశాయ సినిమాతో రాబోతున్నాడు. మరి ఓంకార్ తో నాగ్ చేసే సినిమా ఏ రేంజ్లో ఉంటుందో చూడాలి.