పుష్ప సినిమాతో ఉత్తమ నటుడుగా జాతీయఅవార్డు అందుకొన్న అల్లు అర్జున్, ప్రస్తుతం పుష్ప-2 సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. అల్లు అర్జున్ తన అభిమానుల కోసం తన ఇంటిని, తన దినసరిచర్యని చూపిస్తూ ఓ వీడియో షూట్ చేయించి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో అభిమానులు భిన్నంగా ఉంటారు. వారి గురించి మాటలలో చెప్పడం కష్టం స్వయంగా చూసి తెలుసుకోవలసిందే. నాకు ఇంత స్పూర్తి కలిగిస్తున్నది నా అభిమానులే. వారి అభిమానమే నన్ను మరింతగా శ్రమించేలా చేస్తుంది. వారు మరింత గర్వపడేందుకు నేను ఎంతైనా కష్టపడతాను, “ అని అల్లు అర్జున్ అన్నారు.
ప్రతీరోజు ఉదయం ఇంట్లో కాసేపు యోగా చేసిన తర్వాత తన గార్డెన్, స్విమ్మింగ్ పూల్లో ఓ రౌండ్ కొట్టి బ్లాక్ కాఫీ తాగి రామోజీ ఫిలిమ్ సిటీకి బయలుదేరుతుంటారు. పిల్లలు ఫోన్ చేసినప్పుడు నా ప్రపంచానికి కేంద్రం వారేనని అల్లు అర్జున్ చెప్పారు. ఫిలిమ్ సిటీ బయట, లోపల తన కోసం ఎదురుచూస్తున్న అభిమానులను ఆప్యాయంగా పలకరించిన తర్వాత సెట్స్‌లోని తన కార్వాన్‌లోకి వెళ్తారు. అక్కడ దర్శకుడు సుకుమార్ ఆరోజు షూటింగ్‌కు సంబందించి స్క్రిప్ట్ ఇచ్చి కాసేపు ఇద్దరూ కబుర్లు చెప్పుకొంటారు. మేకప్ వేసుకొని సెట్స్‌లోకి వచ్చేసరికి అంతా సిద్దంగా ఉంటుంది. వెంటనే షూటింగ్ ప్రారంభిస్తారు. షూటింగ్ పూర్తయిన తర్వాత మళ్ళీ మేకప్ తొలగించుకొని కారులో ఇంటికి చేరుకొంటారు.