పుష్ప-2 సినిమా రిలీజ్‌ ఎప్పుడంటే...

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జు రష్మిక మందనలు జంటగా పుష్ప- ది రైజ్ సూపర్ డూపర్ హిట్ అవడంతో దాని సీక్వెల్‌గా వస్తున్న పుష్ప-2 కోసం తెలుగు ప్రేక్షకులే కాదు... దేశవ్యాప్తంగా ప్రజలు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకి సంబందించి ఓ చిన్న సమాచారం మీడియాకు లీక్ అయ్యింది.

అదేమిటంటే ఈ సినిమాని మొదట వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతి పండుగకు విడుదల చేద్దామనుకొన్నప్పటికీ అప్పుడు చాలా సినిమాలు రిలీజ్‌ కాబోతున్నాయి కనుక మార్చి 22న విడుదల చేయాలని మైత్రీ మూవీ మేకర్స్ నిర్ణయించిన్నట్లు తెలుస్తోంది. స్కూళ్ళు, కాలేజీలకు వేసవి సెలవులు మొదలయ్యే ముందు పుష్ప-2ని రిలీజ్‌ చేస్తే వేసవి సీజన్‌ కలిసివస్తుందని భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

పుష్ప-2 సినిమా షూటింగ్‌ మొదలై ఏడాదిపైనే అయ్యింది కానీ ఎప్పటికప్పుడు అప్‌డేట్ ఇవ్వకపోవడంతో అభిమానులు చాలా అసహనంగా ఉన్నారు. మార్చి 22న సినిమా రిలీజ్‌ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటిస్తే అల్పసంతోషులు దానితోనే సర్దుకుపోతారు. పుష్ప-2లో ఫహాద్ ఫాసిల్, ధనుంజయ్, సునీల్, రావు రమేష్, అనసూయ, అజయ్, శ్రీతేజ్, మీమ్ గోపి, జగపతి బాబు తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు. 

పుష్ప-2ని కూడా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాని కూడా మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా కలిసి నిర్మిస్తున్నాయి. కెమెరా: మీరొస్లా కుబా బ్రోజెక్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్ అందిస్తున్నారు.