మహేష్ బాబు, త్రివిక్రం శ్రీనివాస్ కాంబినేషన్లో ‘గుంటూరు కారం’ సినిమా మొదలుపెట్టినప్పటి నుంచి ఏవో అవాంతరాలు ఏర్పడుతూనే ఉన్నాయి. దీంతో సినిమా జనవరి 13కి విడుదలవుతుందా లేదా?అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే సినిమా షూటింగ్ ఆలస్యమైనప్పటికీ మొదలుపెడితే ఇద్దరూ చాలా వేగంగా పని పూర్తి చేస్తుంటారనే సంగతి తెలిసిందే. ముఖ్యంగా మహేష్ బాబు సెట్స్‌లోకి వస్తే షూటింగ్ చకచకా పూర్తయిపోతుంది.
ఇటీవలే హైదరాబాద్, ఈ సినిమా షూటింగ్ మళ్ళీ మొదలుపెట్టి వారం రోజులలో పూర్తిచేయాలని దర్శకుడు త్రివిక్రం శ్రీనివాస్ ప్లాన్ చేసుకొని అందుకు తగ్గట్లుగా అన్ని ఏర్పాట్లు చేసుకొన్నారు. అయితే ఆరు రోజులలో పూర్తిచేయవలసిన సన్నివేశాలన్నిటినీ మహేష్ బాబు కేవలం మూడు రోజులలోనే పూర్తి చేసేశారు.
తర్వాత షెడ్యూల్ కోసం సారధి స్టూడియోలో సెట్స్ వేశారు. నేటి నుంచి దానిలో షూటింగ్ జరుగబోతోంది. దీనిలో మహేష్ బాబు, జగపతిబాబు, రమ్యకృష్ణల మీద కొన్ని సన్నివేశాలు షూట్ చేయబోతున్నారు.
గుంటూరు కారంలో మహేష్ బాబుకు జోడీగా మీనాక్షీ చౌదరి, శ్రీలీల నటిస్తున్నారు. మహేష్ బాబు తాతగా, ప్రజాబంధు జనదళం పార్టీ ప్రధాన కార్యదర్శి వైరా వెంకటస్వామిగా ప్రకాష్ రాజ్ నటిస్తున్నారు.
హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్.రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంగీతం ఎస్.తమన్, కెమెరా: పిఎస్ వినోద్, ఎడిటింగ్ నవీన్ నూలి, ఆర్ట్ డైరెక్టరుగా ఏఎస్ ప్రకాష్ పనిచేస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 13వ తేదీన విడుదల కాబోతోంది.