
కార్పోరేట్ సంస్థ నుండి ప్రొడ్యూసర్ గా టర్న్ అయిన పివిపి భారీ రేంజ్లో సినిమాలు చేస్తున్నాడు కాని ఫలితం మాత్రం ఆశించినంతగా అందుకోలేదు. సూపర్ స్టార్ మహేష్ బ్రహ్మోత్సవం ఫ్లాప్ తో పెద్ద కన్ ఫ్యూజన్లో పడ్డ పివిపి ఆ లాస్ కవర్ చేసేందుకు మహేష్ తో మరో సినిమా ప్లాన్ చేశాడు. మహేష్ బర్త్ డే నాడు వంశీ పైడిపల్లి డైరక్షన్లో సినిమా అని ఎనౌన్స్ చేసిన అది అవుతుందో లేదో అని డౌట్ ఉండేది. కాని పివిపి మరోసారి ఆ విషయంపై క్లారిటీ ఇచ్చాడు. మహేష్ తో సినిమా కచ్చితంగా ఉంటుందని ఆ సినిమా వచ్చే ఏడాది ద్వితియార్ధంలో ఉంటుందని అన్నారు.
ప్రస్తుతం మహేష్ మురుగదాస్ కాంబినేషన్లో సినిమా వస్తుండగా ఆ తర్వాత కొరటాల శివ సినిమా ప్లాన్ చేస్తున్నాడు. అయితే ఈ రెండిటిని ముగించుకున్నాక వంశీ పైడిపల్లితో సినిమా ఉంటుందట. మహేష్ సినిమాపై వస్తున్న వార్తలన్నిటిని కొట్టిపారేసి తనతో సినిమా గురించి కన్ఫాం చేశాడు పివిపి. ప్రస్తుతం తన నిర్మాణంలో వచ్చిన కాష్మోరా సినిమా హిట్ అవడంతో కాస్త రిలాక్సెడ్ గా ఉన్నారు.
ఫ్లాప్ అయిన నిర్మాతకు మరో సినిమా చేయడం టాలీవుడ్ హీరోలకు అలవాటే. బ్రహ్మోత్సవం లాస్ చేసే క్రమంలో మహేష్ పివిపి బ్యానర్లో మరో సినిమా రాబోతుంది. వంశీ పైడిపల్లి ఇప్పటికే ఈ సినిమాకు సంబందించిన స్క్రిప్ట్ సిద్ధం చేశారట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా 2017లో స్టార్ట్ అవనున్నదట.