
ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వరుణ్ తేజ్, సాక్షి వైద్య జోడీగా ‘గాంఢీవధారి అర్జున’ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తి చేసుకొని ఆగస్ట్ 25న విడుదలకు సిద్దం అవుతోంది. కనుక సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సోమవారం సాయంత్రం 6 గంటల నుంచి హైదరాబాద్‌లోని జెఆర్‌సీ కన్వెన్షన్ సెంటర్‌లో ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతున్నట్లు సినీ నిర్మాణ సంస్థ ఎస్వీసీసీ ట్విట్టర్‌లో తెలియజేసింది.
వరుణ్‌తేజ్ కెరీర్‌లోనే తొలిసారిగా చాలా భారీ బడ్జెట్‌లో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. సినిమాలో కొన్ని యాక్షన్ సన్నివేశాలను అమెరికా, యూరోపియన్ దేశాలలో షూట్ చేశారు. ఈ సినిమాకి సంగీతం: మిక్కీ జె.మేయర్, సినిమాటోగ్రఫీ: ముఖేష్, ఆర్టిస్ట్: అవినాష్ కొల్ల అందించారు.