
బాలకృష్ణ వందవ సినిమాగా వస్తున్న గౌతమిపుత్ర శాతకర్ణి నుండి మరో లుక్ రివీల్ చేశాడు దర్శకుడు క్రిష్. ఫస్ట్ లుక్ పోస్టర్ నుండి అంచనాలను పెంచేసిన ఈ సినిమా రీసెంట్ గా దసరా నాడు రిలీజ్ అయిన టీజర్ కూడా ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక దీవాళి గిఫ్ట్ గా బాలయ్య లుక్ ను రిలీజ్ చేశారు. ఫ్యాన్స్ కు దీవాళి గిఫ్ట్ గా వస్తున్న ఈ సినిమా తెలుగు సినిమా చరిత్రలో ఓ ప్రత్యేక సినిమాగా నిలుస్తుందని చెప్పొచ్చు. ఇక మొదటి వారంలో ట్రైలర్ భారీ ఎత్తున రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.
దీవాళి కల్లా ట్రైలర్ రిలీజ్ చేసే ఆలోచన చేసినా అది కుదరలేదు. ఇక ట్రైలర్ రిలీజ్ కూడా యూఎస్, యుకె లో ఒకేసారి 100 థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారట. దీవాళి గిఫ్ట్ తో మరోసారి తన సత్తా చాటిన బాలయ్య సినిమా భారీ రేంజ్ హిట్ కొట్టడం ఖాయం అన్నట్టు కనిపిస్తున్నాడు. 80 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా భారీ సెట్టింగులతో నిర్మితమవుతుంది. సంక్రాంతి బరిలో విజయ ఢంకా మోగించేందుకు వస్తున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలను సృష్టిస్తుందో చూడాలి.