
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఖైది నెంబర్ 150 సినిమా ఫస్ట్ లుక్ చిరు బర్త్ డే నాడు వచ్చినా అవి షాడో పిక్స్ అవడం చేత చిరు లుక్ బయట పడలేదు. అయితే దీవాళి సందర్భంగా మెగా ఫ్యాన్స్ కు ట్రీట్ ఇచ్చేందుకు మెగా లుక్ రివీల్ చేశారు. ఆ లుక్ చూస్తే మెగాస్టార్ లోని స్టైల్ ఏమాత్రం తగ్గలేదని చెప్పేయొచ్చు. కొద్దిగంటల క్రితం రిలీజ్ అయిన ఈ మెగా లుక్ ఫ్యాన్స్ అందరిని ఆకట్టుకుంటుంది.
వినయాక్ డైరక్షన్లో వస్తున్న ఈ సినిమా తమిళ సూపర్ హిట్ సినిమా కత్తికి రీమేక్ గా వస్తుంది. కాజల్ హీరోయిన్ గా నటిస్తున్న ఖైది నెంబర్ 150 మూవీకి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. వయసు పెరిగినా వన్నె తగ్గలేదు అన్నట్టు మెగా స్టార్ 60 వసంతాలను పూర్తి చేసుకున్నా సరే తనలోని స్టామినా అలానే ఉంది అన్నట్టు కనిపిస్తుంది ఈ పోస్టర్స్ చూస్తుంటే. సినిమా ఇంకెంత సందడి చేస్తుందో చూడాలి. సంక్రాంతి రిలీజ్ టార్గెట్ పెట్టుకున్న ఈ ఖైది మరోసారి రికార్డుల పని పట్టడం ఖాయం అన్నట్టు పరిస్థితులు కనబడుతున్నాయి.