
వంశీ దర్శకత్వంలో మాస్ మహారాజ రవితేజ చేస్తున్న ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమా టీజర్ విడుదలైంది. 1970 దశకంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను, ప్రభుత్వాన్ని గడగడలాడించిన గజదొంగ టైగర్ నాగేశ్వరరావు. అతని జీవిత కధ ఆధారంగా అదే పేరుతో రవితేజ ఈ సినిమాతో అక్టోబర్ 20న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
టైగర్ నాగేశ్వరరావు పటిష్టమైన భద్రత కలిగిన మద్రాస్ సెంట్రల్ జైలు నుంచి తప్పించుకొని పారిపోయిన్నట్లు టీజర్ మొదలుపెట్టి, ఇంటలిజన్స్ అధికారిగా నటిస్తున్న బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్‌తో అతను ఎంత ప్రమాదకరమైనవాడో చెపుతుండగా టైగర్ నాగేశ్వరరావు పాత్రను ఆవిష్కరించారు దర్శకుడు వంశీ.
స్టువర్టుపురానికి చెందిన ఓ గజదొంగ కధలో ఇద్దరు హీరోయిన్లు నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్‌లను పెట్టడం ఆశ్చర్యం కలిగిస్తుంది. కానీ సినిమా చూస్తే ఇద్దరు హీరోయిన్లు దేనికో అర్దం కావచ్చు.
టైగర్ నాగేశ్వరరావులో మురళీశర్మ, రేణు దేశాయ్, మండవ సాయి కుమార్, ముఖేష్ చబ్ర, ప్రవీణ్ దాచారం తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ ఈ సినిమాను తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి డైలాగ్స్: శ్రీకాంత్ విస్స, కెమెరా: ఆర్ మాధే, సంగీతం: జీవి ప్రకాష్ కుమార్ అందిస్తున్నారు.