5.jpg)
ప్రభాస్, కృతి సనన్, సైఫ్ ఆలీఖాన్ వంటి హేమాహేమీలు నటించిన ఆదిపురుష్ ఫస్ట్-లుక్ దశ నుంచి సినిమా థియేటర్లలో విడుదలయిన తర్వాత కూడా విమర్శలు ఎదుర్కొంటూనే ఉంది. దర్శకుడు ఓంరౌత్ ఎంతగా సమర్ధించుకొన్నప్పటికీ భారతీయులు ఆ సినిమాని అంగీకరించకపోవడంతో ఫ్లాప్ అయ్యింది. ఆ సినిమా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో గురువారం అర్దరాత్రి నుంచి ప్రసారం అవుతోంది.
రామాయణగాధను ఇదివరకు చాలామంది దర్శకనిర్మాతలు సినిమాలుగా, టెలీ సీరియల్స్ గా తీసి ప్రజల మెప్పుపొందారు. కానీ ఆదిపురుష్ పేరుతో రామాయణాన్ని, హిందువుల ఆరాధ్య దైవాలైన సీతారామాంజనేయులను అపహాస్యం చేసేవిదంగా చూపడం వలననే తిరస్కారానికి గురైంది. ఆ సినిమా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారం అవుతోంది.
ఆదిపురుష్ ఓటీటీ హక్కులు ముందుగానే అమ్ముకోవడం వలన ఆ సినిమా నిర్మాతలకు కొంత పెట్టుబడి తిరిగిరావచ్చునేమో కానీ ఆ సినిమాను థియేటర్లలో చూడనివారు ఇప్పుడు అమెజాన్ ప్రైమ్‌లో చూసి వారు కూడా మరోసారి దర్శకనిర్మాతలను తిట్టుకోవడం ఖాయమే. ఈ సినిమా కధ భారతీయులందరికీ కంఠస్తమైన రామాయణ గాధ కనుక మళ్ళీ ఈ సినిమా కధ గురించి కొత్తగా చెప్పుకోనవసరం లేదు.