
మెగాస్టార్ చిరంజీవి, తమన్నా, కీర్తి సురేశ్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన భోళాశంకర్ రేపు (శుక్రవారం) ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. కనుక భోళాశంకర్ సినిమా టికెట్ ధరలు పెంచుకోవడానికి అనుమతి కోరుతూ చిత్రబృందం ఏపీ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకొంది.
కానీ నిబందనల ప్రకారం ఏపీలో భోళాశంకర్ సినిమా 20 శాతం షూటింగ్ చేసినట్లు, సినిమా నిర్మాణానికి రూ.100 కోట్లు ఖర్చు పెట్టిన్నట్లు నిరూపించే పత్రాలను దరఖాస్తుతో జత చేయలేదంటూ అనుమతి నిరాకరించింది. అన్ని వివరాలతో మళ్ళీ దరఖాస్తు చేసుకొంటే పరిశీలిస్తామని ఏపీ ప్రభుత్వం తెలియజేసింది.
అయితే దీనికి కారణం మొన్న వాల్తేర్ వీరయ్య సినిమా ఫంక్షన్‌లో చిరంజీవి ఏపీ ప్రభుత్వంపై చేసిన విమర్శలే అని అందరికీ తెలుసు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే, “హీరోల పారితోషికాల గురించి పార్లమెంటులో చర్చించడానికి ఇదేమైనా జాతీయసమస్యా?మావల్ల సినిమాలు ఆడుతున్నాయి కనుకనే నిర్మాతలు మళ్ళీ మాతో మాతో సినిమాలు తీస్తున్నారు. మా సినిమాలతో వేలాదిమందికి ఉపాధి కల్పిస్తున్నాము. ప్రభుత్వానికి పన్నుల రూపంలో భారీగా ఆదాయం సమకూరుస్తున్నాం. మేము ప్రజలను రంజింపజేస్తున్నాము. కానీ మీరు ప్రజా సమస్యలని పట్టించుకోకుండా పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం సంధించిన్నట్లు మా సినిమా పరిశ్రమపై ఎందుకు పడుతున్నారు?మాపై పడే బదులు ఏపీలో రోడ్లు, అభివృద్ధి, ప్రత్యేకహోదా గురించి ఆలోచిస్తే బాగుంటుందని చిరంజీవి చిన్న చురకలు వేశారు.
ఏపీలో మంత్రులందరూ ఆయనపై మూకుమ్మడిగా ఎదురుదాడి చేశారు. ఇప్పుడు ఆయన సినిమాకు ఏపీ ప్రభుత్వం ఈవిదంగా కొర్రీలు వేస్తోంది.