రెండు భారీ సెట్స్‌లో గుంటూరు కారం

మహేష్ బాబు-త్రివిక్రం శ్రీనివాస్‌ కలిసి తయారుచేస్తున్న ‘గుంటూరు కారం’లో అనేక అవాంతరాల తర్వాత మళ్ళీ రెగ్యులర్ షూటింగ్‌ జరుగుతోంది. ఈ సినిమాకి సంబందించి చిన్న విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో మహేష్ బాబు తల్లి, తాతగారి ఇళ్ళ సెట్స్‌ వేసిన్నట్లు తెలుస్తోంది. ఇళ్ళంటే ఏవో చిన్న సెట్స్‌ కావట. రెండూ చాలా భారీ సెట్స్‌ అని తెలుస్తోంది. ప్రస్తుతం వాటిలో షూటింగ్‌ చేస్తున్నారట. 

మొదట పూజా హెగ్డేను హీరోయిన్‌గా తీసుకొంటే ఆమెకు డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో శ్రీలీలను తీసుకొని ఆమెతో పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. కానీ ఆమె కూడా వెళ్లిపోవడంతో ఆమె స్థానంలో మీనాక్షీ చౌదరికి మహేష్ బాబుకు జోడీగా నటించే గొప్ప అవకాశం లభించింది. క్రియేటివ్ డిఫరెన్స్ కారణంగా ఈ సినిమాటోగ్రాఫర్ పిఎస్ వినోద్ తప్పుకొన్న సంగతి తెలిసిందే.  

గుంటూరు కారం సినిమాను జనవరి 13న రిలీజ్‌ డేట్ లాక్ చేసి షూటింగ్‌ మొదలుపెట్టిన తర్వాత వరుసగా ఇన్నిసార్లు షూటింగ్‌ నిలిచిపోవడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాకు సంగీతం ఎస్.తమన్, కెమెరా: పిఎస్ వినోద్, ఎడిటింగ్ నవీన్ నూలి, ఆర్ట్ డైరెక్టరుగా ఏఎస్ ప్రకాష్ పనిచేస్తున్నారు.