ఆగస్ట్ 6న భోళాశంకర్‌ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ ఎక్కడంటే...

మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, తమన్నా జంటగా వస్తున్న భోళాశంకర్‌ సినిమా ఆగస్ట్ 11న విడుదల కాబోతోంది. కనుక ఆగస్ట్ 6వ తేదీ సాయంత్రం 7 గంటలకు హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో భోళాశంకర్‌ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ నిర్వహించబోతున్నట్లు ఏకె ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ ట్విట్టర్‌ ద్వారా తెలియజేసింది.

వాల్తేర్ వీరయ్య తర్వాత చిరంజీవి చేస్తున్న మరో పక్క మాస్ మసాలా సినిమా ఇది. దాని కంటే ఈ సినిమా ఇంకా అద్భుతంగా ఉంటుందని చిరంజీవి చెప్పారు. ఈ సినిమాలో చిరంజీవి కోల్‌కతాలో టాక్సీ డ్రైవరుగా నటించగా, తమన్నా లాయరుగా నటించింది.  చిరంజీవి చెల్లెలుగా కీర్తి సురేష్ నటించింది. వీరి ముగ్గురి కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై చాలా భారీ అంచనాలే ఉన్నాయి. 

ఈ సినిమాలో మురళీశర్మ, రఘుబాబు, వెన్నెల కిషోర్, కాశి విశ్వనాథ్, బ్రహ్మాజీ, వేణు, సుశాంత్, ఉత్తేజ్, రవిశంకర్, హైపర్ ఆది, తరుణ్ అరోరా, తాగుబోతు రమేష్, బిత్తిరి సత్తి, గెటప్ శ్రీను, షావార్ ఆలీ, సితార, ప్రగతి, సత్య అక్కల, రశ్మి గౌతమ్, శ్రీముఖి, తులసి శివమణి, లోబో ముఖ్యపాత్రలు చేశారు. 

తమిళంలో సూపర్ హిట్ అయిన వేదాళం (2015)కి ఇది తెలుగు రీమేక్. ఈ సినిమాని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌, క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్లపై రామబ్రహ్మం సుంకర, అజయ్ సుంకర నిర్మించారు.  

ఈ సినిమాకి సంగీతం: మహతి స్వరసాగర్, పాటలు: రామజోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యామ్, డైలాగ్స్: మామిడ్ల తిరుపతి, కొరియోగ్రఫీ: శేఖర్ మాస్టర్, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, దిలీప్ సుబ్బరాయన్, ఫోటోగ్రఫీ: డుడ్లీ, ఎడిటింగ్: మార్తాండ్ కె వెంకటేష్ అందించారు.