
మహేష్ బాపు దర్శకత్వంలో స్వీటీ అనుష్క, నవీన్ పోలిశెట్టి జోడీగా మిస్.శెట్టి మిస్టర్ పోలిశెట్టి రేపు అంటే ఆగస్ట్ 4న విడుదల కావలసి ఉండగా చివరి నిమిషంలో వాయిదా వేస్తున్నట్లు యూవీ క్రియెషన్స్ సంస్థ ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం అవడం వలన సినిమాను వాయిదా వేయవలసి వచ్చిన్నట్లు తెలిపింది. ఇందుకు ప్రేక్షకులకు క్షమాపణలు చెప్పుకొంటూ, త్వరలోనే ట్రైలర్, సినిమా విడుదల తేదీలను ప్రకటిస్తామని తెలిపింది.
ఈ సినిమాలో అనుష్క లండన్‌లో ఓ స్టార్ హోటల్‌లో చెఫ్‌గా పనిచేస్తుంటే, నవీన్ పోలిశెట్టి స్టాండప్ కమెడియన్‌గా నటించారు. వీరిద్దరి మద్య ఏవిదంగా ప్రేమ చిగురించింది... చివరికి ఏం జరిగిందనేది ఈ సినిమా కధ.
ఈ సినిమాలో మురళీశర్మ, జయసుధ, తులసి, నాజర్, కౌశిక్ మెహతా, అభినవ్ గోమఠం, సోనియా తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాకు కధ, దర్శకత్వం పి. మహేష్ బాబు, పాటలు: రామజోగయ్య శాస్త్రి, సంగీతం: రాధన్, కెమెరా: నీరావ్ షా, కొరియోగ్రఫీ: రాజు సుందరం మాస్టార్, ఎడిటింగ్: కోటగిరి వేంకటేశ్వర రావు చేస్తున్నారు.
ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్ కలిసి తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో నిర్మిస్తున్నారు.