నాగ్ కే నిద్ర పట్టకుండా చేశాడట..!

కింగ్ నాగార్జున చాలా ఓపెన్ మైండెడ్ గా ఉంటారు. పరిశ్రమకు సంబందించిన ఏ విషయం గురించైనా సరే ఆయన తీరు ఒకే విధంగా ఉంటుంది. ఇక టాలెంట్ ను మెచ్చుకోవడంలో ఎంకరేజ్ చేయడంలో నాగార్జున తర్వాతే ఎవరైనా అయితే అలాంటి నాగార్జునకు నిద్ర పట్టకుండా చేశాడు ఓ నూతన దర్శకుడు. అతని పేరు చెప్పలేదు కాని అతను చెప్పిన కథకు నాగార్జున మైండ్ బ్లాంక్ అయ్యిందట. లైన్ తోనే అంత ఎక్సయిటింగ్ ఫీల్ అయిన నాగార్జున మొత్తం కథతో ఇంకెంత సర్ ప్రైజ్ అవుతాడో.

నాగ్ మేనళ్లుడు సుమంత్ నరుడా డోనరుడా ఆడియో రిలీజ్ కార్యక్రమంలో నాగార్జున ఈ విషయాలన్ని చెప్పడం జరిగింది. ఇక సుమంత్ ఈ సినిమాకు పడ్డ కష్టం తాను చూశానని మెసేజ్ తో కూడినా ఎంటర్టైన్మెంట్ సినిమా కాబట్టి తప్పకుండా ఈ సినిమా విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బాలీవుడ్ విక్కి డోనార్ సినిమా రీమేక్ గా వస్తున్న ఈ సినిమా హిందిలో భారీ విజయాన్ని అందుకుంది. మరి తెలుగులో ఈ సినిమా ఫలితం ఎలా ఉండబోతుందో చూడాలి.