
కమల్ కూతురిగా మొదట హీరోయిన్ గా తన టాలెంట్ చూపించేందుకు బాగా కష్టపడ్డ శృతి హాసన్ గబ్బర్ సింగ్ హిట్ తో ట్రాక్ ఎక్కేసింది. ఇక తర్వాత ఓ భాష అని తేడా లేకుండా అన్ని భాషల్లో అమ్మడు టాప్ హీరోయిన్ గా చెలామణి అవుతుంది. సౌత్ లో క్రేజ్ సంపాదిస్తూనే మరో పక్క బాలీవుడ్ లో కూడా తన సత్తా చాటిన శృతి ఈమధ్య కాస్త గ్యాప్ ఇచ్చినట్టు కనిపించింది. దానికి కారణం సౌత్ లో బిజీ అవ్వడమే. అయితే లేటెస్ట్ గా ఓ బీ టౌన్ ఆఫర్ శృతి ను పలుకరించింది.
రాజ్ కుమార్ రావ్ హీరోగా తెరకెక్కుతున్న 'బెహెన్ హోగీ తేరీ' సినిమాలో హీరోయిన్ గా శృతి హాసన్ కన్ఫాం అయ్యింది. ప్రస్తుతం కమల్ నటిస్తూ నిర్మిస్తున్న శభాష్ నాయుడుతో పాటుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాటమరాయుడు సినిమాలో నటిస్తున్న శృతి హిందిలో అవకాశం రావడం పట్ల సంతోషంలో మునిగి తేలుతుంది. ఇక సినిమా మొత్తం తన క్యారక్టర్ హైలెట్ గా నిలుస్తుందట.