నిహారిక సెకండ్ ఇన్నింగ్స్‌... కండిషన్స్ అప్ప్లై

నాగబాబు కుమార్తె నీహారిక కొణిదెల భర్త చైతన్య జొన్నలగడ్డ నుంచి విడాకులు తీసుకొన్న తర్వాత మళ్ళీ తన సినిమా కెరీర్‌పై దృష్టి పెట్టింది. ఆమె పెళ్ళికి ముందుకు కొన్ని సినిమాలు, వెబ్‌ సిరీస్‌ చేసి ఉన్నందున, సెకండ్ ఇన్నింగ్స్‌ ప్రారంభించేందుకు ఎటువంటి ఇబ్బందీ ఉండదు. 

కానీ ఇదివరకు భర్త, అత్తవారింట్లోవారు అభ్యంతరం చెప్పగా, ఇప్పుడు నాగబాబు దంపతులే ఆమెను వారిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే నీహారిక మాత్రం పోయిన చోటే ఉంగరం వెతుక్కోవాలన్నట్లు మళ్ళీ ఎక్కడ తన ప్రయాణం ఆపేసిందో అక్కడి నుంచే ప్రారంభించాలని నిర్ణయించుకొన్నట్లు తెలుస్తోంది. ఓ యువదర్శకుడుతో ఆమె ఓ సినిమా చేసేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అతను చెప్పిన కధకు ఓకే చెప్పేసి సినిమాకు గ్రీన్ సిగ్నల్‌ కూడా ఇచ్చేసింది. త్వరలోనే ఈ సినిమాకు సంబందించి ప్రకటన వెలువడవచ్చు. 

తెలుగులో హీరోయిన్లుగా నటించేవారు చిట్టిపొట్టి డ్రెస్సులలో అందాల ప్రదర్శన చేయవాల్సి ఉంటుంది. హీరోలతో లిప్‌లాక్స్ కూడా ఇప్పుడు చాలా కామన్. అందుకు సిద్దమైన వారికే సినిమా అవకాశాలు వస్తుంటాయి. కానీ నీహారిక మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినందున ఆమె తన సినిమాలలో డిగ్నిటీ మెయిన్‌టెయిన్ చేయవలసి వచ్చింది. 

పాత సినిమాలలో హీరోయిన్లలలాగ హీరోలను ఆంటీ అంటన్నట్లుగా నటిస్తుండటం, సాంప్రదాయంగా చీరకట్టుకొని నటిస్తుండటంతో ఆమె తనకు తానే ఓ గిరిగీసుకొని అందులో బందీ అయిపోయింది. ఇదీగాక ఆమె మెగా ఫ్యామిలీ నుంచి రావడంతో మిగిలిన హీరోయిన్లతో వ్యవహరించిన్నట్లు, తీసిన్నట్లు దర్శకులు ఆమెతో తీయలేకపోవడం కూడా ఆమె సినిమాలలో ఎదగలేకపోయింది. 

ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా ఆమె ఇవే నియమనిబంధనలు పెట్టుకొని వస్తే ఆమె మిగిలిన హీరోయిన్లతో పోటీ పడటం కష్టం. కనుక నిర్మాతగా సెటిల్ అవడం మంచిదేమో?