విశ్వక్ సేన్ అప్పుడే 11వ సినిమా మొదలుపెట్టేశాడే!

తెలుగు సినీ పరిశ్రమలో ఓ తరం హవా నడుస్తుండగానే మరో తరం చొచ్చుకువచ్చేసి సత్తా చాటుకొంటుంది. ఏఎన్నార్, ఎన్టీఆర్‌ రాజ్యం ఏలుతుండగా కృష్ణ, కృష్ణంరాజు, శోభన్‌బాబు, మురళీమోహన్, చంద్రమోహన్, మోహన్ బాబు వంటివారు దూసుకొచ్చేసిన్నట్లే, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, పవన్‌ కళ్యాణ్‌, అల్లు అర్జున్‌, ప్రభాస్‌, మహేష్ బాబు తదితరులు సినీ పరిశ్రమను ఏలుతుండగానే, నాని, శర్వానంద్, నాగ చైతన్య, వరుణ్ తేజ్, సాయి ధరంతేజ్ వంటివారు అనేకమంది దూసుకువచ్చేశారు.

ఇప్పుడు వారి జూనియర్స్ కూడా వచ్చేశారు. వారిలో విశ్వక్ సేన్ ఒకరు. తనదైన శైలి, నటన, సినిమాలతో అందరినీ మెప్పిస్తూ ఇప్పటికే ఓ పది సినిమాలు చేసేశాడు. ఇప్పుడు 11వ సినిమాకి సిద్దం అయిపోతున్నాడు. ఈ నెల 31వ తేదీ ఉదయం 10.19 గంటలకు తన సినిమా టైటిల్‌, ఫస్ట్ గ్లింప్స్ విడుదల కాబోతోంది. 

ఈ సినిమాకు కృష్ణ చైతన్య దర్శకత్వం వహించబోతున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్ట్యూన్ 4 సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య కలిసి ఈ సినిమాని నిర్మించబోతున్నారు. ఈ సినిమాకు సంబందించి పూర్తి వివరాలు ఆరోజే తెలిసే అవకాశం ఉంది.