వెంకీ అట్లూరితో దుల్కర్ ‘లక్కీ భాస్కర్’

మహానటి సినిమాతో మలయాళ నటుడు సల్మాన్ దుల్కర్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత హనురాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన సీతారామంతో ప్రజల హృదయాలను టచ్ చేశారు. ఇప్పుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నాడు. దానికి ‘లక్కీ భాస్కర్’ అనే క్యాచీ టైటిల్‌ పెట్టి శుక్రవారం టైటిల్‌ పోస్టర్‌ విడుదల చేశారు. పోస్టర్‌లో దుల్కర్ మొహం పూర్తిగా కనబడనీయకుండా వందరూపాయల నోటు అడ్డంపెట్టి చూపారు. 

ఈ సినిమాను సీతారా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్-4 సినిమా బ్యానర్లపై  నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకు సంబందించి పూర్తి వివరాలు ఇంకా తెలియవలసి ఉంది.