
కోలీవుడ్ హీరో ధనుష్ ప్రధానపాత్రలో వస్తున్న పీరియాడికల్ మూవీ కెప్టెన్ మిల్లర్. ఈ సినిమా డిసెంబర్ 15న విడుదల కాబోతోంది. కనుక ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ ఈరోజు ధనుష్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టీజర్ విడుదల చేశారు. బ్రిటిష్ కాలంలో జరిగిన తిరుగుబాట్లు, పోరాటాలను కధాంశంగా తీసుకొని ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమాకు టైటిల్ ‘కెప్టెన్ మిల్లర్’ అని టైటిల్ పెట్టడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ సినిమాలో ధనుష్ కెప్టెన్ మిల్లర్ నటిస్తున్నాడు.
దీనికి అరుణ్ మాతేశ్వరన్ 2018లో కధ ఇవ్వగా దాంతో 2019లో ఈ సినిమా మొదలుపెట్టాలనుకొన్నారు కానీ మూడు సంవత్సరాల తర్వాత అంటే 2022లో మొదలుపెట్టారు. దీనిని సత్యజ్యోతి ఫిలిమ్స్ బ్యానర్‌పై అర్జున్ త్యాగరాజ్, సెంధిల్ కలిసి తమిళంలో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్రియాంకా ఆరుళ్ మోహన్, శివరాజ్ కుమార్, నాజర్, సందీప్ కిషన్, విజిఎ చంద్రశేఖర్, వినోద్ కిషన్, ఎడ్వర్డ్ సొన్నెన్‌బ్లిక్, జాన్ కొక్కెన్ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకు సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్, కెమెరా: సిద్దార్ధ్ నుని, స్టంట్స్: ధీలీప్ సుబ్బరాయన్, డైలాగ్స్: మాధన్ కర్కి, ఆర్ట్: టి.రామలింగం, ఎడిటింగ్: నాగూరన్ చేస్తున్నారు.
ధనుష్కు తెలుగు రాష్ట్రాలలో కూడా చాలా మంది అభిమానులున్నారు కనుక ఈ సినిమాను అదే పేరుతో తెలుగులో డబ్బింగ్ చేసి విడుదల చేసే అవకాశం ఉంది.