అమెజాన్ ప్రైమ్‌లో నిఖిల్ స్పై సినిమా

కార్తికేయ-1,2 సినిమాలతో పాన్ ఇండియా హీరోగా ఎదిగిన నిఖిల్ అదే ఊపులో మంచి యాక్షన్ మూవీ ‘స్పై’ చేశాడు. ఈ సినిమా ఫస్ట్-లుక్‌, టీజర్‌, ట్రైలర్‌ అన్ని చాలా గొప్పగా ఉండటంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ‘స్పై’ని కూడా పాన్ ఇండియా మూవీగానే తీసి జూన్ 27న థియేటర్లలో విడుదల చేయగా మొదటి మూడు రోజులలోనే నెగెటివ్ టాక్ రావడంతో ఫ్లాప్ అయ్యింది.  

ఇప్పుడు ఈ స్పై సినిమా అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చేసింది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఒకేసారి ప్రసారం అవుతోంది. స్పై సినిమాలో నిఖిల్ రా ఏజంట్‌ ‘జై’గా నటించగా అతనికి జోడీగా సాన్యా ఠాకూర్, ఐశ్వర్య మేనన్ నటించారు. 

ఈడీ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై కె. రాజశేఖర్ రెడ్డి ఈ సినిమాను నిర్మించి, కధ అందించారు. కధ చాలా గొప్పగానే ఉంది కానీ దానిని తెరకెక్కించడంలో దర్శకుడు తడబడటంతో స్పై ‘ఆపరేషన్ సక్సస్ బట్ పేషంట్‌ డెడ్’ అన్నట్లయింది.