
మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి, తమన్నా జోడీగా వస్తున్న భోళాశంకర్ సినిమా ఆగస్ట్ 11న విడుదల కాబోతుండటంతో సినిమా ప్రమోషన్స్ వేగం పెచారు. ఈ సినిమా ట్రైలర్ ఈ నెల 27న విడుదల చేయబోతున్నట్లు ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రకటించింది.
ఇది వాల్తేర్ వీరయ్య తర్వాత వస్తున్న మరో మాస్ సినిమా కావడంతో మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఆతృతగా దీనికోసం ఎదురుచూస్తున్నారు. కోల్‌కతాలో చిత్రీకరించిన చిరంజీవి సినిమాలు హిట్ అవుతుంటాయి కనుక ఈ సినిమా కూడా తప్పకుండా హిట్ అవుతుందని గట్టి నమ్మకంతో ఉన్నారు.
ఈ సినిమాలో చిరంజీవి కోల్‌కతాలో టాక్సీ డ్రైవర్‌గా నటిస్తుంటే, మిల్కీ బ్యూటీ తమన్నా లాయర్‌గా నటిస్తుండటంతో వీరిద్దరి మద్య రొమాన్స్ లో నుంచి మంచి కామెడీ పండుతుందని అభిమానులు భావిస్తున్నారు. ఈ సినిమాలో కీర్తి సురేశ్ చిరంజీవి చెల్లెలుగా నటిస్తోంది. భోళాశంకర్ సినిమాని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్లపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు.
భోళాశంకర్‌లో మురళీశర్మ, రఘుబాబు, వెన్నెల కిషోర్, రావు రమేష్, బిత్తిరి సత్తి, ఉత్తేజ్, గెటప్ శ్రీను, రవిశంకర్, ప్రగతి, సత్య అక్కల, రశ్మి గౌతమ్, శ్రీముఖి, తులసి శివమణి, లోబో ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకి సంగీతం: మహతి స్వరసాగర్, పాటలు: రామజోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యామ్, డైలాగ్స్: మామిడ్ల తిరుపతి, కొరియోగ్రఫీ: శేఖర్ మాస్టర్, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, దిలీప్ సుబ్బరాయన్, ఫోటోగ్రఫీ: డుడ్లీ, ఎడిటింగ్: మార్తాండ్ కె వెంకటేష్ అందిస్తున్నారు.