అక్టోబర్ 19న భగవంత్ కేసరి

అనిల్ రావిపూడి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ, కాజల్ అగర్వాల్ జంటగా వస్తున్న ‘భగవంత్ కేసరి’ (సబ్ టైటిల్‌: ఐ డోంట్ కేర్) సినిమాను అక్టోబర్ 19న విడుదల చేయబోతున్నట్లు షైన్ స్క్రీన్స్ ట్విట్టర్‌లో ప్రకటించింది. “భగవంత్ కేసరి ఆయుధ పూజతో గీ సారి దసరా జోర్దారుంటది,” అంటూ  రెండు తుపాకులు చేతపట్టుకొని వస్తున్న బాలయ్య పోస్టర్‌ విడుదల చేసింది. ఈ ఏడాది దసరా పండగ అక్టోబర్ 24న పడింది. కానీ బాలయ్య అభిమానులకు వారం రోజుల ముందే పండగ మొదలైపోతుంది.  

తండ్రీకూతుర్ల సెంటిమెంట్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలకృష్ణ కూతురుగా శ్రీలీల నటిస్తోంది. ఈ సినిమా కధ తెలంగాణలో జరుగుతుంది కనుక బాలయ్య తెలంగాణ యాసలో డైలాగ్స్ చెప్పబోతున్నారు. అందుకే టైటిల్‌, రిలీజ్‌ పోస్టర్స్ లో తెలంగాణ యాసలో డైలాగ్స్ కోట్ చేస్తున్నారు. 

భగవంత్ కేసరి సినిమాను షైన్ స్క్రీన్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంగీతం: ధమన్, కెమెరా: ఎస్.రాంప్రసాద్, స్టంట్స్: వి.వెంకట్, ఎడిటింగ్: తమ్మిరాజు చేస్తున్నారు.