
కమెడియన్ నుండి హీరోగా మారిన వారంతా మొదట బాగానే సందడి చేసినా ఆ తర్వాత మాత్రం ఆడియెన్స్ ను అలరించలేకపోతున్నారు. ఉదాహరణకు సునీల్ పరిస్థితే తీసుకుంటే కమెడియన్ గా సూపర్ ఫాంలో ఉన్న తను హీరోగా టర్న్ అయిన మొదట్లో పర్వాలేదు అనిపించాడు ఇక ఆ తర్వాత మాత్రం హిట్ కోసం తహతహలాడుతున్నాడు. అయితే ఈ క్రమంలో కమెడియన్ గా వచ్చి హీరోగా మారడం అనేది బ్యాడ్ సెంటిమెంట్ అనుకుంటున్న టైంలో మరో కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి హీరోగా టర్న్ అయ్యాడు.
గీతాంజలిలో ఆల్రెడీ ఆ ప్రయత్నం చేసి సక్సెస్ అయిన శ్రీనివాస్ రెడ్డి ప్రస్తుతం జయమ్ము నిశ్చయమ్మురా సినిమాతో మరోసారి తన అదృష్టాన్ని పరిక్షించుకోబోతున్నాడు. టీజర్ లో వస్తున్న సాంగ్ అయితే బాగానే ఉంది. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అదిరే రేంజ్ లో జరిగిందట. పెట్టిన బడ్జెట్ 3.5 కోట్లు కాగా ఇప్పటికే 7 కోట్లకు రైట్స్ తీసుకున్నారట. సో ఏ లెక్కన చూసుకున్నా నిర్మాతకు ప్రాఫిట్సే అన్నమాట.
ఓ పక్క సునీల్ చేస్తున్న సినిమాలకు కనీసం శాటిలైట్ బిజినెస్ కూడా అవ్వట్లేదు అంటుంటే శ్రీనివాస్ రెడ్డి సినిమా ఏకంగా రిలీజ్ కు ముందే లాభాలు తీసుకు రావడం అందరిని ఆశ్చర్య పరుస్తుంది. పూర్ణ హీరోయిన్ గా నటించిన జయమ్ము నిశ్చయమ్మురా సినిమా త్వరలో రిలీజ్ అవుతుంది.