అమెరికాలో శాన్‌డియాగోలో నేటి నుంచి కామిక్ కాన్ వేడుకలు ప్రారంభం అయ్యాయి. ఈ వేడుకలలోనే ప్రభాస్, దీపికా పడుకొనే జంటగా నటిస్తున్న ప్రాజెక్ట్-కె సినిమా ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేస్తామని వైజయంతీ మూవీస్ సంస్థ ఇదివరకే ప్రకటించింది. చెప్పిన్నట్లుగానే శాన్‌డియాగోలో నేటి నుంచి కామిక్ కాన్ వేడుకల వద్ద ప్రాజెక్ట్-కె హడావుడి మొదలైంది.
అక్కడ నల్లటి దుస్తులలో ఆయుధాలు పట్టుకొని నిలబడిన గ్రహాంతరవాసులు కాపలా కాస్తుంటారు. వారి చేతుల్లో ‘ఇప్పుడే అంతం మొదలైంది’ అనే చిన్న బ్యానర్లు ప్రదర్శిస్తున్నారు. స్థానికులు, పిల్లలు వారి విచిత్రవేషధారణ చూసి వారితో కలిసి ఫోటోలు దిగుతున్నారు. ‘మా రైడర్స్ కామిక్ కాన్‌కు వచ్చేశారని’ వైజయంతీ మూవీస్ ట్వీట్ చేసింది.
వారిని చూస్తే దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్-కె సినిమాలో గ్రహాంతరవాసులు భూమీదకు వచ్చి దాడి చేయడం వంటి హాలీవుడ్ స్థాయి అంశాలు కూడా చూపించబోతున్నట్లే ఉన్నారు. అసలు ఈ ప్రాజెక్ట్-కె ఏమిటి?అనే విషయం తెలియజేస్తామని, ఫస్ట్ గ్లింప్స్ కూడా విడుదల చేస్తామని ముందే చెప్పారు కనుక మరికొద్ది సేపటిలో తెలుస్తుంది.
ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్, దిశా పఠానీ, బ్రహ్మానందం నటిస్తున్నారు. సల్మాన్ దుల్కర్, సూర్య అతిధి పాత్రలలో చేస్తున్నట్లు తెలుస్తోంది. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీ దత్ రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా తీస్తున్నారు. ఈ సినిమాకి కెమెరా: డానీ సాంజెక్ లోపెజ్, సంగీతం మిక్కీ జె మేయర్ అందిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి పండుగకు ముందు అంటే జనవరి 12న విడుదలకాబోతోంది.

Now Begins the End 💥💥💥#ProjectK First Glimpse on July 20 (USA) & July 21 (INDIA).

Our Raiders have arrived at @Comic_Con. pic.twitter.com/PuZaWGAx4i
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) July 20, 2023