.jpg)
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్, దీపికా పడుకొనే జోడీగా వస్తున్న ప్రాజెక్ట్-కెలో ప్రభాస్ ఫస్ట్-లుక్ పోస్టర్‌ను వైజయంతీ మూవీస్ సంస్థ ఈరోజు సోషల్ మీడియాలో విడుదల చేసింది. ప్రభాస్ కవచం వంటిది ధరించి పైనుంచి స్పైడర్ మ్యాన్‌లా భూమిపై దూకిన్నట్లు ఉంది ఆ పోస్టర్ చూస్తే. రేపు అమెరికాలోని శాన్ డియాగోలో కామిక్ కాన్ వేడుకలు జరుగబోతున్నాయి. ఆ వేడుకలలో ప్రాజెక్ట్-కె టైటిల్‌తో పాటు ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేస్తామని ఆ మర్నాడు అంటే జూలై 21న భారత్‌లో కూడా విడుదల చేయబోతున్నామని ఇదివరకే ప్రకటించింది.
ప్రాజెక్ట్-కె సినిమాలో ప్రభాస్, దీపికా పడుకొనే, బిగ్-బి అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్, దిశా పఠానీ, బ్రహ్మానందం నటిస్తున్నారు. సల్మాన్ దుల్కర్, సూర్య అతిధి పాత్రలలో చేస్తున్నట్లు తెలుస్తోంది.
వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీ దత్ రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా తీస్తున్నారు. ఈ సినిమాకి కెమెరా: డానీ సాంజెక్ లోపెజ్, సంగీతం మిక్కీ జె మేయర్ అందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి పండుగకు ముందు అంటే జనవరి 12న ఈ ప్రాజెక్ట్-కె సినిమా విడుదలకాబోతోంది.