
నిజామాబాద్‌కు గుంటూరుకారానికి ఏం సంబంధం అంటే ఉందని ఈ పోస్టర్ చెపుతోంది. త్రివిక్రం శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు ‘గుంటూరు కారం’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబందించి ఓ పోస్టర్ లీక్ అయ్యింది. దానిలో నిజామాబాద్ జిల్లాని కనెక్ట్ చేశారు. “ప్రజాబంధు జనదళం పార్టీ ప్రధాన కార్యదర్శి గౌ. శ్రీ వైరా వెంకటస్వామిగారికి 80వ జన్మదిన శుభాకాంక్షలు,” ఇట్లు జనాదళం పార్టీ యువజన నాయకులు, నిజామాబాద్ జిల్లా, అంటూ ప్రకాష్ రాజ్ ఫోటోతో ఉన్న ఓ ఫ్లెక్సీ బ్యానర్ గుంటూరు కారం లొకేషన్ నుంచి లీక్ అయ్యింది. ఇది అప్పుడే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ సినిమాకు ‘గుంటూరు కారం’ అని పేరు పెట్టారు గాబట్టి ఆంద్రాలో జరిగే స్టోరీ అని అందరూ భావించారు. అయితే ఈ తాజా ఫ్లెక్సీ బ్యానర్‌తో ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో జరిగే కధ అని స్పష్టమవుతోంది. అయితే ఇందులో ప్రకాష్ రాజ్ విలన్‌గా చేస్తున్నారా లేక హీరోకు సహకారం అందించే రాజకీయ పార్టీ నాయకుడుగా చేస్తున్నారా? అనే విషయం తెలియాల్సి ఉంది.
ఈ సినిమాలో మహేష్ బాబుకి జోడీగా మొదట పూజా హెగ్డేను తీసుకొన్నప్పటికీ ఆమె డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోవడంతో ఆమె స్థానంలో మీనాక్షీ చౌదరిని తీసుకొన్నారు. ఆమె చెల్లెలుగా శ్రీలీల నటిస్తోంది.
హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్.రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంగీతం ఎస్.తమన్, కెమెరా: పిఎస్ వినోద్, ఎడిటింగ్ నవీన్ నూలి, ఆర్ట్ డైరెక్టరుగా ఏఎస్ ప్రకాష్ పనిచేస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 13వ తేదీన విడుదల కాబోతోంది.