
కేవలం సినిమాలో కామెడీ చేసి నవ్వించడమే కాదు సమయం దొరికినప్పుడు బయట కూడా తన మార్క్ సెటైరికల్ పిక్స్ తో నవ్వులు చిందేలా చేస్తాడు సీనియర్ యాక్టర్ బ్రహ్మాజి. వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా తనను అభిమానించే వారి కోసం ఏదో ఒక అప్డేట్ ట్విట్టర్ లో పెడుతూనే ఉంటాడు. అయితే ప్రస్తుతం దీవాళి సందర్భంగా ఒంటి నిండా గాయాలతో ఓ పిక్ పెట్టాడు బ్రహ్మాజి.
అదేంటి ఏదైనా యాక్సిడెంట్ అయ్యి బ్రహ్మాజికి దెబ్బలు తగిలాయా అన్న డౌట్ వచ్చేలా మేకప్ వేసుకుని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకుంటే ఇలానే గాయాల పాలవ్వాల్సి వస్తుందని హెచ్చరిస్తూ కామెంట్ పెట్టాడు బ్రహ్మాజి. అంతేకాదు హ్యాపీ దీవాళి సేఫ్ దీవాళి అంటూ మెసేజ్ కూడా పోస్ట్ చేశాడు. సో అదన్నమాట సంగతి గాయాలతో బ్రహ్మాజి ఫేస్ చూసి కంగారు పడ్డ వారంతా అతను పెట్టిన ట్వీట్ చూసి భలే నవ్వుకుంటున్నారు.
సినిమాల్లో నటిస్తూ నవ్వులు పండించే బ్రహ్మాజి తనకు తోచిన రీతిలో ఇలా నలుగురికి మంచి మాట చెప్పడం మంచి విషయమే అని చెప్పాలి. మరి బ్రహ్మాజి రిక్వెస్ట్ ఎంతమంది పాటిస్తారో తెలియదు కాని ఒకవేళ తను చెప్పినట్టు జాగ్రత్తలు తీసుకోకుంటే తనలానే రియల్ గా గాయాల పాలు అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.