ప్రాజెక్ట్-కె నుంచి మరో అప్‌డేట్... దీపిక ఫస్ట్-లుక్‌

నాగ్ అశ్విన్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా వస్తున్న ప్రాజెక్ట్-కె నుంచి మరో అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా నటిస్తున్న బాలీవుడ్‌ బ్యూటీ దీపిక పడుకొనే ఫస్ట్-లుక్‌ విడుదలైంది. రేపటి భవిష్యత్‌ కోసం ఓ ఆశాకిరణం.... అంటూ దీపికను పరిచయం చేసింది. జూలై 20న అమెరికాలో, 21న భారత్‌ ప్రాజెక్ట్-కె ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేయబోతున్నట్లు మరోసారి వైజయంతీ మూవీస్ తెలియజేసింది. 

ప్రాజెక్ట్-కెలో బిగ్‌-బి అమితాబ్ బచ్చన్‌, కమల్‌హాసన్‌, దిశా పఠానీ, బ్రహ్మానందం, సల్మాన్ దుల్కర్, సూర్య తదితరులు నటిస్తున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీ దత్ రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా తీస్తున్నారు. ఈ సినిమాకి కెమెరా: డానీ సాంజెక్ లోపెజ్, సంగీతం మిక్కీ జె మేయర్ అందిస్తున్నారు. ప్రాజెక్ట్-కె 2024, జనవరి 12న విడుదల కాబోతోంది.

దీనికంటే ముందుగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్, శ్రుతీ హాసన్‌ జంటగా చేస్తున్న సలార్ సినిమా ఈ ఏడాది సెప్టెంబర్‌ 28న విడుదల కాబోతోంది. ఈ రెండు కాకుండా మారుతి దర్శకత్వంలో ప్రభాస్‌ రాజా డీలక్స్ అనే మరో సినిమా చేస్తున్నారు. ఆ సినిమా నుంచి ఒకటి రెండు లొకేషన్ ఫోటోలు తప్ప ఇంతవరకు అప్‌డేట్స్ రాలేదు.