
సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్, సమంత జంటగా వచ్చిన రంగస్థలం సూపర్ హిట్ అయినప్పటి నుంచి తెలుగు సినీ పరిశ్రమలో పీరియాడికల్ మూవీలు రావడం మొదలయ్యాయి.
మంచి అభిరుచి గల నిర్మాతగా పేరు సంపాదించుకొన్న ‘పెళ్ళి చూపులు’ సినిమా నిర్మాత యష్ రంగినేని బిగ్‌బెన్ సినిమాస్ బ్యానర్‌పై చందూ ముద్దు దర్శకత్వంలో ‘అన్నపూర్ణ ఫోటో స్టూడియో’ అనే పీరియాడికల్ సినిమా సిద్దం చేశారు. ‘ఇచ్చట ఫోటోలు అందంగా తీయబడును’ అనేది దానికి సబ్ టైటిల్. అది కూడా చక్కగా ఉంది.
ఈ సినిమాలో చైతన్యరావు, లావణ్య హీరో హీరోయిన్లుగా చేస్తున్నారు. 1980 దశకంలో గ్రామీణ నేపధ్యంలో సాగే ఓ ప్రేమకధకి కొంచెం క్రైమ్ కూడా జోడించి ఫోటో స్టూడియోగా తీసుకువస్తున్నారు.
ఈ సినిమా జూలై 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ క్లీన్ ‘యూ’ సర్టిఫికేట్ ఇచ్చిందని, సకుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా అంటూ ఈరోజు సురేశ్ ప్రొడక్షన్స్ ఓ పోస్టర్ విడుదల చేశారు. ఈ సినిమాకు సంగీతం: ప్రిన్స్ హెన్రీ, కెమెరా: పంకజ్ తొత్తడ.