1.jpg)
శైలేశ్ కొలను దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ 75వ చిత్రం ‘సైంధవ్’ సినిమా నుంచి ఓ తాజా పోస్టర్ వచ్చింది. ఈ సినిమాలో గాయత్రిగా నటిస్తున్న బేబీ సైరాతో ఉన్న పోస్టర్ అది. ఆ పాపను రక్షించడానికి వెంకటేష్ ఏదో పెద్ద పోరాటమే చేసిన్నట్లు మొహం మీద గాయాలు చెపుతున్నాయి. ఈ సినిమాతో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధీఖీ కూడా ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్ర చేస్తున్నారు.
ఈ సినిమాకి సంగీతం: సంతోష్ నారాయణ్, కెమెరా: ఎస్.మణికందన్ అందిస్తున్నారు. ఇప్పటికే రానా నాయుడు వెబ్ సిరీస్‌తో వెంకటేష్ ఉత్తరాది ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. కనుక సైంధవ్‌ను తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళంతో పాటు హిందీలో కూడా పాన్ ఇండియా మూవీగా తీస్తున్నారు.
నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వెంకటేష్ బోయినపల్లి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. హిట్ యూనివర్స్ పేరుతో వరుసగా హిట్-1,2,3 అంటూ మంచి యాక్షన్, క్రైమ్, థ్రిల్లర్ సినిమాలు నిర్మిస్తున్న యువ దర్శకుడు సైలేశ్ కొలను ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండటంతో ఈ సినిమాపై చాలా బారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.