
అశ్విని బాబు, నందిత శ్వేత హీరో హీరోయిన్లుగా అనీల్ కన్నెగంటి దర్శకత్వంలో హిడింబ అనే యాక్షన్ థ్రిల్లర్ సినిమా ఈ నెల 20న విడుదల కాబోతోంది. ఈ సినిమా టీజర్, ట్రైలర్ ఇప్పటికే విడుదలయ్యి సినిమాపై ఆసక్తి రేపుతున్నాయి. సోమవారం రివర్స్ యాక్షన్ ట్రైలర్ పేరుతో మరో ట్రైలర్ రిలీజ్ చేశారు. చెప్పిన్నట్లుగానే ట్రైలర్ మొత్తం రివర్స్‌లో సాగింది. ఇదో వెరైటీ అనుకొన్నప్పటికీ ఈ రివర్స్ ట్రైలర్ కూడా సినిమా పట్ల ఆసక్తి పెంచుతోంది.
ఈ సినిమాకు కధ: దర్శకత్వం: అనీల్ కన్నెగంటి, డైలాగ్స్: కళ్యాణ చక్రవర్తి, సంగీతం: వికాస్ బడిస, పాటలు: రామజోగయ్య శాస్త్రి, విరించి పుట్ల, ప్రణవం, బి.సుబ్బరాయ శర్మ, కెమెరా: బి.రాజశేఖర్, ఆర్ట్: షర్మిల యలశెట్టి, స్టంట్స్: రియల్ సతీష్, ఝాషువా, అనీల్ కన్నెగంటి, ఎడిటింగ్: ఎంవి. రమణ చేశారు.
ఏకే ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో ఎస్వికె సినిమాస్ బ్యానర్‌పై శ్రీధర్ గంగపట్నం ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా జూలై 20న విడుదల కాబోతోంది.