జూలై 20న ప్రాజెక్ట్-కె గ్లింప్స్... రెడీయా?

ఆదిపురుష్‌ తర్వాత వస్తున్న మరో భారీ సినిమా ప్రాజెక్ట్-కె. నాగ్ అశ్విన్‌ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ సంస్థ రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌తో దీనిని అంతర్జాతీయ స్థాయిలో నిర్మిస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్‌తో పాటు బిగ్‌-బి అమితాబ్ బచ్చన్, యూనివర్సల్ స్టార్ కమల్‌హాసన్‌, బాలీవుడ్‌ హీరోయిన్‌ దీపికా పడుకొనే, దిశా పఠానితో సహా పలువురు ప్రముఖ నటీనటులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు. సల్మాన్ దుల్కర్, సూర్య అతిధి పాత్రలలో నటిస్తున్నారు. కనుక ప్రభాస్‌ అభిమానులతో పాటు సినీ అభిమానులందరూ ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

ఈ నెల 20న అమెరికా, శాన్‌డియోగ్‌ కామిక్‌కాన్‌ కార్యక్రమంలో ఈ సినిమా దేని గురించి?అనే విషయం తెలియజేస్తూ గ్లింప్స్ విడుదల చేయబోతున్నట్లు వైజయంతీ మూవీస్ ప్రకటించింది. మర్నాడు భారత్‌లో విడుదల చేస్తామంటూ ట్వీట్‌ చేసింది. 

ఈ సినిమాలో శాస్త్రవేత్తగా నటిస్తున్న అమితాబ్ బచ్చన్ ప్రపంచానికి మేలు చేసే ఓ ఆవిష్కరణ చేస్తే, విలన్‌గా నటిస్తున్న కమల్‌హాసన్‌ దానిని దొంగిలించి ప్రపంచాన్ని గడగడలాడిస్తుంటాడు. అప్పుడు మన హీరో ప్రభాస్‌, హీరోయిన్‌ దీపికా పడుకొనేతో కలిసి కమల్‌హాసన్‌ చేతిలో నుంచి ఆ పరికరాన్ని ఏవిదంగా స్వాధీనం చేసుకొంటాడు.... ఈ సందర్భంగా వారిద్దరి మద్య ఏ స్థాయిలో పోరాటం జరిగిందనేది ఈ సినిమా కధాంశం అని తెలుస్తోంది. 

ఈ సినిమాకి కెమెరా: డానీ సాంజెక్ లోపెజ్, సంగీతం మిక్కీ జె మేయర్ అందిస్తున్నారు.