
సినీ పరిశ్రమలో చిన్న హీరోలు తమ సినిమాలలో అభిమానం కొద్దో లేదా తమ సినిమాకి పెద్ద హీరోల ఆశీర్వవాలు, వారి అభిమానుల ఆదరణ పొందాలనో మరో కారణం చేతనో పెద్ద హీరోల ప్రస్తావన చేస్తుంటారు. అయితే కొన్నిసార్లు పెద్ద హీరోలు సైతం ప్రేక్షకులను ఆకర్షించడానికి మరో పెద్ద హీరోల ప్రస్తావన తమ సినిమాలలో చేస్తుంటారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఆవిదంగా అన్న చిరంజీవి డైలాగ్స్ , పాటలకు డ్యాన్స్ చేసి ఆకట్టుకొన్నారు. ఇప్పుడు ఇండస్ట్రీలోనే అతిపెద్ద హీరోగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి కూడా తన భోళాశంకర్ సినిమాలో తమ్ముడు పవన్ కళ్యాణ్‌ని యాక్టింగ్ స్టైల్, డైలాగ్స్ వినిపించి ప్రేక్షకులను ఆకట్టుకోబోతున్నారు.
చిరంజీవి తాను చేస్తున్న సినిమా నుంచి ఆసక్తికరమైన చిన్న చిన్న బిట్స్ ‘చిరు లీక్స్’ పేరుతో అభిమానులకు లీక్ చేస్తూ వారితో పంచుకొంటారు. భోళాశంకర్ సినిమా నుంచి మరో చిన్న బిఐటి లీక్ చేశారు. ఈవిషయం తెలిస్తే దర్శకుడు మెహర్ రమేష్ గొడవచేస్తాడు అయినా పర్వాలేదు అంటూ ‘ఏ మేరా జహా.... అనే పాటలో పవన్ కళ్యాణ్‌ని ఇమిటేట్ చేసి చూపారు. ఇది తమ్ముడి పాట మస్తుందిలే...” అంటూ చెప్పడం చూసి చిరంజీవి, పవన్ కళ్యాణ్ అభిమానులు ఆనందంతో పొంగిపోయారు. మరెందుకు ఆలస్యం? మనమూ ఓ లుక్ వేసేద్దాం.. అన్నయ్యాలో తమ్ముడిని చూసేద్దాం....
మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవికి జోడీగా తమన్నా, చెల్లెలుగా కీర్తి సురేశ్ నటిస్తున్న భోళాశంకర్ ఆగస్ట్ 11న విడుదలకాబోతోంది. తమిళంలో సూపర్ హిట్ అయిన వేదాళం (2015)కి ఇది తెలుగు రీమేక్. ఈ సినిమాని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్లపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు.
ఈ సినిమాలో మురళీశర్మ, రఘుబాబు, వెన్నెల కిషోర్, రావు రమేష్, బిత్తిరి సత్తి, ఉత్తేజ్, గెటప్ శ్రీను, రవిశంకర్, ప్రగతి, సత్య అక్కల, రశ్మి గౌతమ్, శ్రీముఖి, తులసి శివమణి, లోబో ముఖ్యపాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాకి సంగీతం: మహతి స్వరసాగర్, ఫోటోగ్రఫీ: డుడ్లీ.
#ChiruLeaks #BholaaShankar #BholaaShankarAsPK#BholaaShankarOnAug11 pic.twitter.com/E7FmyeFulw