
మెగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరం తేజ్ కలిసి నటిస్తున్న బ్రో సినిమా ఈ నెల 28న విడుదల కాబోతుండటం సినిమా ప్రమోషన్స్ స్పీడు పెంచారు. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ఈ సినిమా నుంచి సెకంగ్ సాంగ్ విడుదల చేశారు.
జాణవులే... అంటూ సాగే ఈ పాటను విదేశంలో చిత్రీకరించారు. ఈ పాట చాలా స్లోగా ఉంది. కాసర్ల శ్యామ్ వ్రాసిన ఈ పాటను తమన్ స్వరపరచి కె. ప్రణతితో కలిసి స్వయంగా ఆలపించారు. బహుశః అందుకే స్లోగా కంపోజ్ చేసుకొన్నారేమో? ఇక సాయి ధరం తేజ్, కేతికా శర్మల గ్రూప్ డ్యాన్స్ చూస్తే నీరసం వచ్చేస్తుంది. అది కూడా చాలా స్లోగా చాలా రొటీన్ గా ఉంది. ఈ మాత్రం పాటకి విదేశాలకు వెళ్ళి షూటింగ్ చేయాలా? అనిపించకమానదు.
సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రోహిణి, బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి, సుబ్బరాజు, రాజా చెంబోలు, ప్రియా ప్రకాష్ వారియర్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు.
ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రం శ్రీనివాస్ డైలాగ్స్, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరియు జీస్టూడియోస్ బ్యానర్లపై టిజి విశ్వ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్న ఈ సినిమాకు సంగీతం: తమన్, కెమెరా: సుజిత్ వాసుదేవ్, ఆర్టిస్ట్ డైరెక్టర్: ఏఎస్ ప్రకాష్, ఎడిటింగ్: నవీన్ నూలి చేస్తున్నారు. జూలై 28న బ్రో సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలకాబోతోంది.