విరూపాక్ష సినిమాతో హిట్ కొట్టిన సాయి ధరమ్ తేజ్, తన తర్వాత సినిమా పూర్తి భిన్నంగా ఉండేలా జాగ్రత్త పడుతున్నాడు. ఈసారి మంచి కామెడీ సబ్జెక్ట్ ఎంచుకొన్నాడు. అదే... చీటీల బిజినెస్ చేసే చిన్నీగా నటించబోతున్నాడు.
కొత్త దర్శకుడు జయంత్ పానుగంటి దర్శకత్వంలో విరూపాక్ష తీసిన శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పైనే బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించబోతున్న ఈ సినిమాకు ‘చీటీల చిన్ని’ అనే పేరు ఖరారు చేసిన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను బాపినీడు సమర్పణలో తెరకెక్కించబోతున్నారు.
అఖిల్ అక్కినేని ఏజంట్ సినిమాలో, తర్వాత వరుణ్ తేజ్ చేస్తున్న గాంధీవధారి అర్జున్ సినిమాలో హీరోయిన్‌గా చేస్తున్న సాక్షి వైద్యను ఈ సినిమాలో సాయి ధరమ్ తేజకు జోడీగా తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. జూలై నెలాఖరులోగా ఈ సినిమా పూజా కార్యక్రమాలు చేసి ఆగస్ట్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టవచ్చని తెలుస్తోంది.
ఇక సాయి ధరమ్ తేజ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో కలిసి బ్రో సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మార్క్ (మార్కండేయులు)గా నటిస్తున్న సాయి ధరమ్ తేజ్‌కు కేతిక శర్మ జోడీగా నటించింది. బ్రో సినిమా జూలై 28న విడుదల కాబోతోంది. అది విడుదలైన తర్వాత ఈ కొత్త సినిమా మొదలుపెట్టాలని సాయి ధరమ్ తేజ్ భావిస్తున్నాడు.